calender_icon.png 20 November, 2025 | 2:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆటోను ఢీకొట్టిన లారీ

16-08-2024 01:57:56 AM

  1. ఇద్దరి మృతి, 14 మందికి గాయాలు 
  2. గద్వాల జిల్లా అలంపూర్‌లో ఘటన

అలంపూర్, ఆగస్టు 15: కూలీపనుల నిమిత్తం ఆటోలో వెళ్తున్న ఆ అభాగ్యులను లారీ రూపంలో మృత్యువు కబళించింది. ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాలు.. ఏపిలోని కర్నూల్ జిల్లా తాండ్రపాడు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు గురువారం గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఉండవల్లి మండలం కండుపాడు గ్రామానికి  ఆటోలో కూలిపనుల నిమిత్తం వెళ్తుండగా.. ఓ లారీ అతివేగంగా వచ్చి వారు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళా కూలీలు.. సుజాత (35), రమాదేవి (30) అక్కడికక్కడే మృతి చెందగా 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. క్షతగాత్రులను కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్టున్నట్లు  ఎస్‌ఐ తెలిపారు.