9 May, 2026 | 7:37 PM

మక్కల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

09-05-2026 06:05 PM

తాడ్వాయి,(విజయక్రాంతి): రైతులు మక్కల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని తాడువాయి సింగిల్ విండో చైర్మన్ నల్లవెల్లి కపిల్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో ఆయన శనివారం మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు తాము పండించిన ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సూచించారు.బయట దళారులకు మక్కలు అమ్మవద్దని తెలిపారు. బయట మార్కెట్లో మక్కలు విక్రయించి నష్టపోవదని సూచించారు.