11 March, 2026 | 4:58 AM

అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతుల భారీ ర్యాలీ

11-03-2026 12:00 AM

గుండాల, మార్చి 10 (విజయక్రాంతి): మండల కేంద్రంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్, సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, ఏవీఎస్పీ, సీపీఎం, బీఆర్‌ఎస్, సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా, తుడుందెబ్బ సంఘాల ఆధ్వర్యంలో వ్యవసాయ బోర్లకు 24 గంటలు త్రిపేస్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని, విద్యుత్ కోతలను నిలిపివేయాలని, లో ఓల్టేజ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రైతులతో కలిసి మంగళవారం మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాను నిర్వహించి, తహసీల్దార్ ఖాసీంకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు వాగబోయిన చంద్రయ్య దొర సభ అధ్యక్షతన జరిగిన సభలో గుండాల సర్పంచ్ కొమరం సీతారాములు మాట్లాడుతూ.. మండలంలో ప్రధాన జీవనాధారంగా వ్యవసాయం చేస్తున్న రైతులు మొక్కజొన్న పంట బోర్లకు త్రీపేస్ కరెంట్ 24 గంటలు ప్రభుత్వం అందజేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొడెం వెంకటేశ్వర్లు, ప్రజాపంథా మండల అధ్యక్షులు మంగయ్య, ముత్తాపురం సర్పంచ్ కల్తి రాధ, మామకన్ను సర్పంచ్ కల్తి రజిత, సీపీఎం మండల కార్యదర్శి తోలెం గోపి, రేపాకుల శ్రీనివాస్ బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు పూనెం రమణబాబు, సుధాకర్, రాజేష్, రామనాథం, రైతులు తదితరులు పాల్గొన్నారు.