15 July, 2026 | 2:52 AM

ఏసీసీ లాభంలో భారీ వృద్ధి

26-04-2024 12:10 AM

ముంబై, ఏప్రిల్ 25: అదానీ గ్రూప్ సిమెంట్ కంపెనీ ఏసీసీ స్టాండెలోన్ నికరలాభం 2024 మార్చి త్రైమాసికంలో భారీ గా 216 శాతం వృద్ధిచెంది రూ.748 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదేకాలంలో కంపెనీ రూ.236 కోట్ల నికరలాభాన్ని సాధించింది. తాజాగా ముగిసిన క్యూ4లో కంపెనీ ఆదా యం 12.67 శాతం పెరిగి రూ.4,790 కోట్ల నుంచి రూ.5,398 కోట్లకు చేరింది. అమ్మకాల పరిమాణం 8.5 మిలియన్ టన్నుల నుంచి 10.4 మిలియన్ టన్నులకు పెరిగినట్టు ఏసీసీ తెలిపింది. ఆపరేటింగ్ పని తీరును సైతం క్యూ4లో కంపెనీ మెరుగుపర్చుకుంది. ఇబిటా 79 శాతం వృద్ధితో రూ. 467 కోట్ల నుంచి రూ.837 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్ గణనీయంగా 570 బేసిస్ పాయింట్లు పెరిగి 15.5 శాతాన్ని అందుకుంది. గురువారం సమావేశమైన ఏసీసీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ.7.50 చొప్పున డివిడెండును సిఫార్సుచేసింది.