7 July, 2026 | 1:18 PM

Breaking News

తృటిలో తప్పిన ప్రమాదం

07-07-2026 12:43 PM

వేములవాడ, జులై 07,(విజయక్రాంతి): వేములవాడ కోరుట్ల వెళ్లే ప్రధాన రహదారి ఐన పోశెట్టిపల్లి, కోనాయపల్లి మధ్యలో భారీ ఈదురు గాలులకు భారీ వృక్షం అటువైపుగా వెళుతున్న ద్విచక్ర వాహనదారుడుపై పడడంతో  వెనక నుండి వస్తున్న వాహనదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కొంత సమయం తర్వాత ద్విచక్ర వాహనదారుడు స్వల్ప గాయాలతో బయటకి రావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.. ప్రయాణికులు ఈ సమయంలో వీచే ఈదురు గాలులకు ఎవరు కూడా చెట్ల కింద ఉండవద్దని అక్కడున్న స్థానికులు చెబుతున్నారు