7 July, 2026 | 12:59 PM

Breaking News

డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు పై సమగ్ర విచారణ జరిపించాలని వినతి   •   ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయం దగ్గర ఉద్రిక్తత   •   తృటిలో తప్పిన ప్రమాదం   •   భువనగిరి మాజీ ఎమ్మెల్యే మృతి పట్ల సీఎం సంతాపం   •   బాన్సువాడ పట్టణంలో డ్రైనేజీలపై ఉన్న దుకాణాల తొలగింపు   •   డ్రైనేజీలపై ఆక్రమణల తొలగింపుకు ప్రజలు సహకరించాలి   •   పొలమెళ్లిన ప్రాణం తిరిగిరాలేదు.. అనాథలైన భార్యాపిల్లలు   •   ప్రధాని మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం   •   నేరాల నియంత్రణ లో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయి: మల్కాజిగిరి సీపీ సుమతి   •   మహారాష్ట్రలో వర్షబీభత్సం.. 24 గంటల్లో 67 సెం.మీ వాన   •  

బాన్సువాడ పట్టణంలో డ్రైనేజీలపై ఉన్న దుకాణాల తొలగింపు

07-07-2026 12:19 PM

బాన్సువాడ, జూలై 7 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని డ్రైనేజీలపై ఆక్రమణ చేసిన దుకాణాల తొలగింపు మంగళవారం ముమ్మరంగా కొనసాగుతుంది. రాష్ట్ర ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ ఆదేశాల మేరకు పట్టణంలోని ప్రధాన రహదారి ఇరు ప్రక్కల ఉన్న డ్రైనేజీలపై నెలకొల్పిన దుకాణాలను, ఏర్పాటుచేసిన సామాగ్రిని వ్యాపారస్తులు స్వచ్ఛందంగా తొలగిస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరణ చేయడంలో భాగంగా వర్షాకాలంలో రోడ్లపై మురికినీరు రాకుండా డ్రైనేజీలను శుభ్రం చేసే ప్రక్రియలో భాగంగా డ్రైనేజీల పై నెలకొన్న దుకాణాలను తొలగిస్తూ డ్రైనేజీలను శుభ్రం చేయడం జరుగుతుంది.