భార్యపై భర్త కొడవలితో దాడి
10-07-2026 02:21 AM
పరిస్థితి విషమం
మల్దకల్, జూలై 9: మండలంలోని మల్లెందొఢ్డి గ్రామంలో భార్యాభర్తల మధ్య గొడవల్లో భర్త తిమ్మప్ప భార్యా మహేశ్వరిపై గురువారం కొడవలితో తలపై దాడి చెయ్యగా మహేశ్వరికి తీవ్ర గాయలయ్యయి. చికిత్స నిమిత్తం మహేశ్వరిని గద్వాల ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. కగా భర్త తిమ్మప్ప వ్యసనలకు బానిసై తరుచు భార్యతో గొడవ పడే వాడని మద్యం మత్తలోనే భార్యపై దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు.






