28 August, 2026 | 4:53 AM

కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు నియామకం

27-08-2026 10:28 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని 28 గ్రామాలకు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులను నియమించినట్లు కాంగ్రెస్ పార్టీ కోనరావుపేట మండల అధ్యక్షుడు మానుక సత్యం తెలిపారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీత శ్రీనివాస్ ఆదేశాల మేరకు గ్రామశాఖ అధ్యక్షుల నియామకాలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన గ్రామశాఖ అధ్యక్షులకు మానుక సత్యం శుభాకాంక్షలు తెలిపారు. గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామశాఖ అధ్యక్షుడు కృషి చేయాలని ఆయన సూచించారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి నాయకులు కృషి చేయాలని కోరారు.