11 May, 2026 | 1:28 PM

Breaking News

మొగిలిపేట క్లస్టర్ గ్రామాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమం   •   ​తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి   •   పంటకోతకు యంత్రాల కొరత.. ఇబ్బందులు పడుతున్న రైతన్న   •   బంగారం కొనుగోళ్లపై దేశప్రజలకు హెచ్చరించిన ప్రధాని మోదీ   •   చంబాలో లోయలో పడిన కారు: ఆరుగురు గుజరాత్‌ పర్యాటకులు మృతి   •   మేడ్చల్‌లో విషాదం: కౌకూర్ చెరువులో అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం   •   అమ్మ ఒడి కార్యక్రమంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు   •   ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •  

భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య

11-12-2024 02:03 AM

చేవెళ్ల, డిసెంబర్ 10: కుటుంబ కలహాలతో నేపథ్యంలో భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చేవెళ్ల మండలం లో జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారంధర్మసాగర్ గ్రామానికి చెందిన విజయ్‌కుమార్(33)కు భార్య సుమలతతో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. గతంలో ఒకసారి టవర్ కూడా ఎక్కాడు. మంగళవారం ఉదయం భార్యతో గొడవ జరిగింది. దీంతో క్షణికావేశంలో విజయ్‌కుమార్ కల్లు కాంపౌండ్‌కు వెళ్లి కల్లుతాగాడు. ఆ తర్వాత తాను చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విజయ్‌కుమార్ తల్లి స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపాడు. కాగా ఇతనికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.