అమ్మ ఒడి కార్యక్రమంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు
భిక్కనూర్, మే 11(విజయ క్రాంతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం అమ్మ ఒడి కార్యక్రమాన్ని డాక్టర్ యమీమా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి రక్త పరీక్షలు నిర్వహించారు. గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోషకాహారంపై అవగాహన కల్పించారు. రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీలకు ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్లు అందించారు. గర్భధారణ సమయంలో వచ్చే సమస్యలపై వివరిస్తూ ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించారు. వేసవికాలంలో తగినంత నీరు తాగాలని, రోజుకు కనీసం నాలుగు లీటర్ల నీరు తీసుకోవాలని, విశ్రాంతి తప్పనిసరిగా తీసుకోవాలని డాక్టర్ యమీమా సూచించారు. కార్యక్రమంలో ఎంఎల్‌హెచ్‌పీ పూజా,హెచ్ ఈఓ వెంకటరమణ, సతీష్ పీహెచ్‌ఎన్ వనజ, సూపర్వైజర్లు సువర్ణ, రాజమణి, హెల్త్ అసిస్టెంట్లు హేమలత, శ్యామల, ల్యాబ్ టెక్నీషియన్ వనశ్రీ పాల్గొన్నారు.






