27 June, 2026 | 2:48 PM

కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు

11-05-2026 11:58 AM

 ప్రమాద సమయంలో 277 మంది ప్రయాణికులు

కాఠ్మండు: నేపాల్ రాజధాని కాఠ్మండులో సోమవారం ల్యాండ్ అయిన ఒక టర్కిష్ ఎయిర్‌లైన్స్(Turkish Airlines Plane Tyre Catches Fire) విమానం అగ్నిప్రమాదానికి గురైందని అధికారులు తెలిపారు. ఈ ఘటన కారణంగా విమానాశ్రయాన్ని ఒక గంట పాటు మూసివేయాల్సి వచ్చింది. ఇస్తాంబుల్ నుండి వచ్చిన Airbus A330 విమానంలోని మొత్తం 277 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బందిని, మంటలు చెలరేగిన అనంతరం ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా సురక్షితంగా బయటకు తరలించినట్లు, నేపాల్ పౌర విమానయాన సంస్థ ప్రతినిధి జ్ఞానేంద్ర భూల్ మీడియాకి తెలిపారు. విమానం రన్‌వేపై కదులుతుండగా (taxiing) ల్యాండింగ్ గేర్‌లో పొగ కనిపించిందని, దీనిపై సాంకేతిక తనిఖీలు ప్రారంభించినట్లు టర్కిష్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. హైడ్రాలిక్ పైపులో తలెత్తిన సాంకేతిక లోపం వల్లే ఆ పొగ వచ్చిందని ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయి.