5 May, 2026 | 3:51 PM

Breaking News

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు   •   హైదరాబాద్ ప్రజలకు చల్లని కబురు   •   నీటి సమస్యకు పరిష్కారం..   •   గంభీరావుపేటకు చేరుకున్న డిప్యూటీ సీఎం, మంత్రులు   •   పంట వ్యర్థాలను దహనం చేయకండి.. రైతులకు డిప్యూటీ సీఎం కీలక సూచన   •   రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ఉచిత అంబలి పంపిణీ   •   మంథనిలో అంగరంగ వైభవంగా "అంగారక చతుర్థి" వేడుకలు   •   పంట వ్యర్థాలను దహనం చేయకండి.. రైతులకు డిప్యూటీ సీఎం కీలక సూచన   •   ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం.. కామారెడ్డి జిల్లాలో నాగిరెడ్డిపేట్ మండలము మొదటి స్థానం   •   ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం.. కామారెడ్డి జిల్లాలో నాగిరెడ్డిపేట్ మండలము మొదటి స్థానం   •  

ప్రియుడి మోజులో పడి భర్త హత్య

28-11-2024 02:35 AM
  1. ఆత్మహత్యగా మార్చే  ప్లాన్ వేసిన భార్య
    1. పోలీసుల అదుపులో నిందితులు?

నాగర్‌కర్నూల్, నవంబర్ 27 (విజయక్రాంతి): ప్రియుడి మోజులో పడి భర్తను భార్య హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయింది. నాగర్‌కర్నూల్ జిల్లా తూడుకుర్తి గ్రామానికి చెందిన చింతలపల్లి జగదీశ్(35), కీర్తి దంపతులు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో నివాసముంటు న్నారు. జగదీశ్ బిజినపల్లి ఎంపీడీవో కార్యాలయంలో అటెండర్‌గా పనిచే స్తున్నాడు.

కీర్తికి నాగర్‌కర్నూల్ పట్టణంలోని ఓ బ్యూటీపార్లర్ నిర్వాహకురాలితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో పనిచేస్తూ బిజినపల్లి మండలం గుడ్లనర్వ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. ఇది తెలిసి జగదీశ్ పలుమార్లు కీర్తిని మందలించాడు. దీంతో భర్త అడ్డు తొలగించుకో వాలనుకుని కీర్తి పతకం వేసింది.

ఈ నెల 24న ప్రియుడితో మాట్లాడుదామని తమ పొలం వద్దకు భర్తతో పాటు ప్రియుడిని రప్పించింది. భర్తకు మద్యం తాగించి ప్రియుడితో కలిసి హతమార్చినట్లు తెలుస్తోంది. అనంతరం మృతదేహాన్ని కెఎల్‌ఐ కాలువలోకి తోసి ఆత్మహత్యగా నమ్మించేందుకు భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరుసటి రోజు సోమవారం బిజినపల్లి మండలం అల్లిపూర్ల్ గ్రామ శివారులోని కాల్వలో జగదీశ్ మృతదేహం బయటపడింది.

కీర్తి కదలికలపై అనుమానంతో జగదీశ్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కీర్తితోపాటు ఆమె ప్రియుడు, మరి కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.