1 July, 2026 | 6:44 PM

Breaking News

ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •  

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం.. కామారెడ్డి జిల్లాలో నాగిరెడ్డిపేట్ మండలము మొదటి స్థానం

05-05-2026 03:37 PM

సంబరాలు జరుపుకున్న ఎంపీడీవో,ఎంపీవో, కార్యదర్శిలు

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో కామారెడ్డి జిల్లాలో నాగిరెడ్డి పెట్ మండలం మొదటి స్థానంలో ఉందని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలు కామారెడ్డి జిల్లాలో మొదటి స్థానంలో ఉన్నందున మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఎంపీఓ ప్రభాకర్ చారి,ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా కార్యదర్శులు ఎంపీడీవో ప్రవీణ్ కుమార్కు శాలువాతో సన్మానించి కేకు కట్ చేశారు.నాగిరెడ్డిపేట్ మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని,ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు చురుకుగా జరిగేందుకు ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ తిరుగుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయడం  వల్లే నాగిరెడ్డిపేట్ మండలం కామారెడ్డి జిల్లాలో ముందు ఉందని కార్యదర్శులు తెలిపారు.

నాగిరెడ్డిపేట్ మండలంలో 363 ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనట్లు అందులో 355 ఇండ్లు మార్కౌట్లు ఇవ్వగా, బిస్మిట్ లేబర్లో 72 ఇండ్లు ఉన్నాయని, రూప్ లెవెల్లో 43 ఇండ్లు పనులు కొనసాగుతున్నాయని, స్లాబ్ లేవలో 137 ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయని ఇప్పటివరకు నాగిరెడ్డిపేట మండలంలో 62 ఇందిరమ్మ ఇండ్లు పూర్తయి లబ్ధిదారులు గృహప్రవేశం చేశారని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా నాగిరెడ్డిపేట్ మండలం కామరెడ్డి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో మొదటి స్థానంలో ఉన్నందున మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నామన్నారు.