5 May, 2026 | 4:47 PM

గంభీరావుపేటకు చేరుకున్న డిప్యూటీ సీఎం, మంత్రులు

05-05-2026 03:44 PM

స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

గంభీరావుపేట,(విజయక్రాంతి): జిల్లా పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు గంభీరావుపేట మండలకేంద్రానికి చేరుకోగా.. వారికి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే పుష్పగుచ్చం అందజేసి.. స్వాగతం పలికారు. పర్యటనలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్ పాల్గొన్నారు.