భార్యపై కోపంతో ఇంటికి నిప్పంటించిన భర్త
08-06-2024 08:17 PM
రాజన్న సిరిసిల్ల: జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యతో గొడవపడిన ఓ భర్త ఇంటికి నిప్పంటించాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం పద్మ నగర్ లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బాల పోశయ్య, రాజేశ్వరి అనే దంపతులు శనివారం ఇంట్లో గొడవ పడ్డారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురై భర్త తన భార్యపై, ఇంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఇంట్లో మంటలు చెల్లరేగుతుండగానే రాజేశ్వరి బయటకు వచ్చింది. ఈ ప్రమాదంలో రాజేశ్వరికి ఏం కాలేదు. ఇల్లు పూర్తిగా దగ్ధమైపోయింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోద చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.






