15 July, 2026 | 3:19 AM

10 నుండి ఇంటర్ సప్లమెంటరీ అనుబంధ పరీక్షలు

08-06-2024 03:02 PM

మహబూబ్ నగర్ : జిల్లాలోని ఇంటర్మీడియేట్ కళాశాలల్లో జూన్ 10 నుండి 12వ తేదీ వరకు ఇంటర్ సప్లమెంటరీ అనుబంధ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి డా. శ్రీధర్ సుమన్ తెలిపారు. ఇంటర్ బోర్డు షెడ్యూల్ ప్రకారం ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షల్లో గైర్హాజరైన, అనుత్తీర్ణులైన విద్యార్థులకు ఈ సప్లమెంటరీ పరీక్ష వివరాలు వెల్లడించారు. ఈ నెల 10న ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ సబ్జెక్టుకు, 11న పర్యావరణ విద్య, 12న నైతిక విలువలు, మానవత పరీక్ష (రెండవ సంవత్సరం విద్యార్థులకు మాత్రమే) నిర్వహించబడుతుందని శ్రీధర్ సుమన్ తెలిపారు.

ఈ పరీక్షలకు అర్హులైన విద్యార్థుల జాబితాలు సంబంధిత కళాశాలల లాగిన్లలో అందుబాటులో ఉన్నాయని, పరీక్ష నిర్వహించడానికి కావల్సిన సమాధాన పత్రాలు జిల్లా ఇంటర్ విద్య కార్యాలయం నుండి తీసుకొని బోర్డు ఆదేశాల మేరకు పరీక్ష నిర్వహించి, మూల్యాంకనం అనంతరం ఆన్ లైన్ లో మార్కుల నమోదు చేయాలని అధికారులకు చెప్పారు. ఈ పరీక్షలకు గాను జిల్లా వ్యాప్తంగా ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ కు 363 మంది, పర్యావరణ విద్యకు117 , నైతికత, మానవ విలువల  పరీక్ష కు 7 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, అన్ని కళాశాలల విద్యార్థులకు సకాలంలో సమాచారాన్ని అందించి పరీక్ష నిర్వహించాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించారు.