1 June, 2026 | 1:00 AM

రూ.13,600 కోట్లతో హైబ్రిడ్ హాన్వివీటి మోడల్ రోడ్డు

01-06-2026 12:30 AM
  1. ఎస్‌ఎల్ బీసీ సొరంగం పూర్తయితేనే రెండు పంటలకు నీళ్లు
  2. రూ.450 కోట్లతో ఎస్‌ఎల్‌బీసీ కాలువల లైనింగ్ పనులు
  3. బీజేపీ నాయకులు బస్సు యాత్ర కాదు.. ఢిల్లీకి పాదయాత్ర చేయాలి
  4. రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్లగొండ, మే 31(విజయక్రాంతి) / కట్టంగూరు : రూ.13 వేల 600 కోట్ల రూపాయలతో హన్వి వీటి మోడల్ రోడ్డు నిర్మాణాల పనులు చేపడుతున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం కనగల్ మండల కేంద్రంలోని రూ.6 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంతో పాటు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విద్య మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తుందని పేర్కొన్నారు

చదువును పేదవారికి దగ్గరగా తీసుకురావాలనే ఉద్దేశంతో తిప్పర్తి, కనగల్ మండల కేంద్రాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యను పూర్తిగా విస్మరించిందన్నారు.విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎన్నడూ కూడా ఎంజి యూనివర్సిటీలో కాలు కూడా పెట్టలేదన్నారు. నేను హెలికాప్టర్లో తిరిగినా.. కార్లో తిరిగినా.. బండిమీద తిరిగిన జిల్లా అభివృద్ధి కోసమేనని స్పష్టం చేశారు. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తాను ఎంతో పార్టీ కోసం కష్టపడ్డామన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 300 ఎకరాలలో ఎంజి యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ఇప్పుడు యూనివర్సిటీ రాష్ట్రంలోనే బెస్ట్ యూనివర్సిటీ గా ఉందన్నారు. యూనివర్సిటీలో డి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ, బీ.ఫార్మసీ, ఎల్‌ఎల్బి కోర్సులు ఈ విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తాయన్నారు. 80 శాతం వరకు ఎస్‌ఎల్బీసీ సొరంగ పనులు పూర్తి అయ్యాయని పేర్కొన్నారు. సొరంగం పనులు పూర్తయితేనే రెండు పంటలకు నీళ్లు అందుతాయని తెలిపారు.గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎస్‌ఎల్బీసీని పట్టించుకున్న దాఖలాలు లేవని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు చేపట్టగా దురదృష్టవశాత్తు సోరంగం కూలి ఎనిమిది మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన టెక్నాలజీతో కిలోమీటర్ వరకు సొరంగం పనులను పూర్తి చేయడం జరిగిందన్నారు.

స్‌ఎల్బీసీ సొరంగం పనులను ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. రూ 13,600 కోట్లతో ధర్వేశిపురం నుంచి కనగల్ -గుర్రంపొడు-దేవరకొండ మీదుగా డిండి వరకు హైబ్రిడ్ హన్వినిటీ మోడల్ తో రోడ్డు నిర్మించడం జరుగుతుందని తెలిపారు. ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే టెండర్లు పూర్తయ్యా అని పేర్కొన్నారు. వచ్చే నెల 13 లేదా 14 తేదీలలో కనగల్ -గుర్రంపోడు మధ్య 100 ఎకరాల స్థలంలో బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పనులను ప్రారంభించే దిశగా ప్లాన్ చేస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోలు పూర్తి కావచ్చాయన్నారు.ధాన్యం కొనుగోలు పూర్తి అయ్యే సమయంలో బిజెపి బస్సు యాత్ర చేయడం కాదు... ఢిల్లీకి పాదయాత్ర చేయాలని సూచించారు. రూ. 450 కోట్లతో ఎస్‌ఎల్బీసీ కాలువ లైనింగ్ పనులు కూడా జరుగుతున్నాయని తెలిపారు. 

మంత్రి వెంట మాజీ జెడ్పిటిసిలు నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, చిట్ల వెంకటేశం, ఆర్టిఏ డైరెక్టర్ కుసుకుంట్ల రాజిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బిక్షం యాదవ్, ధర్వేశిపురం రేణుక ఎల్లమ్మ దేవాలయ చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి, స్థానిక సర్పంచ్ నర్సింగ్ మురళీధర్ గౌడ్,గోలి నర్సిరెడ్డి, సర్పంచులు,స్థానిక నాయకులు కృష్ణ య్య, అందుగుల వెంకటేష్,పెంటయ్య, చం ద్రయ్య, ఆఫీజుద్దీన్, సింగం పెద్దలు, ఎడ్ల గణే ష్ కాంగ్రెస్ తదితరులు పాల్గొన్నారు.