200 బిలియన్ డాలర్లకు హైదరాబాద్ జీడీపీ
l వేగంగా వృద్ధిచెందుతున్న నగరాల్లో మూడో ర్యాంక్
l నైట్ ఫ్రాంక్, సీఐఐ అంచనా
ముంబై, ఏప్రిల్ 17: వచ్చే దశాబ్దకాలంలో హైదరాబాద్ వేగంగా వృద్ధిచెందుతుందని, జీడీపీ గణనీయంగా పెరుగుతుందని ఒక ప్రముఖ నివేదిక వెల్లడించింది. ‘ ఇండియా రియల్ ఎస్టేట్: ఇప్పటినుంచి దశాబ్దకాలానికి’ అనేపేరుతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియ న్ ఇండస్ట్రీ (సీఐఐ), రియల్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్‌లు సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని ప్రస్తావించాయి. 2018లో హైదరాబాద్ నగరం జీడీపీ 50.6 బిలియన్ డాలర్లుకాగా అది 2035కల్లా 201.4 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.17 లక్షల కోట్లు) చేరుతుందని అంచనా వేస్తున్నట్టు నివేదిక పేర్కొంది. హైదరాబాద్ గణనీయమైన ఆర్థికాభివృద్ధిని వివరిస్తూ ఏడాదికి 8.47 శాతం చొప్పున చక్రగతిన పెరుగుతున్నదని, 2019 మధ్యకాలంలో వేగంగా ఎదుగుతున్న టాప్‌హా ప్రపంచ నగరాల్లో 3వ ర్యాంక్ సంపాదించిందని వివరించింది.
10 ట్రిలియన్ డాలర్లకు భారత్ జీడీపీ
వచ్చే దశాబ్దకాలంలో భారత్ జీడీపీ 10.3 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని నైట్‌ఫ్రాంక్, సీఐఐ సంయుక్త రిపోర్ట్ అంచనా వేసింది. అప్పటికల్లా రూపాయి విలువ 2 శాతం క్షీణించవచ్చని పేర్కొంది. దాని ప్రకా రం జీడీపీ రూ.875 లక్షల కోట్లకు పెరగవచ్చని అంచనా. 2023 ఇది రూ.294 లక్షల కోట్లు. యువ జనాభా పెరుగుదల, దేశీయ తయారీ రంగం మెరుగుదల, మౌలికాభివృద్ధి, పట్టణాలు విస్తరించడంతో భారత్ ఆర్థికాభివృద్ధి పుంజుకుంటుందని తెలిపింది.
అప్పటికి భారత రియల్ ఎస్టేట్ రంగం విలు వ 1.5 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని, మొత్తం ఆర్థిక వ్యవస్థలో ఇది దాదాపు 10 శాతం ఉంటుందని నివేదిక అంచనాల్లో పేర్కొంది. 2023లో ఈ మార్కెట్ పరిమా ణం 482 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. జీడీపీలో ఇది 7.3 శాతం. దశాబ్దకాలంలో రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు 906 బిలియన్ డాలర్లతో రెసిడెన్షియల్ విభాగం నేతృత్వం వహిస్తుందని, ఆఫీస్ రంగం 125 బిలియన్ డాలర్లకు చేరుతుందని తెలిపింది. తయారీ రంగం రియల్ ఎస్టేట్‌కు 28 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుస్తుందని, వేర్‌హౌసింగ్ 8.9 బిలియన్ డాలర్ల రెవిన్యూ తెచ్చిపెడుతుందని వివరించింది.
నగరంపై ‘రీట్స్’ దృష్టి
వేగంగా వృద్ధిచెందుతున్న హైదరాబాద్ పలు రియల్‌ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెం ట్ ట్రస్టులను (రీట్స్) ఆకర్షించింద ని నైట్‌ఫ్రాంక్, సీఐఐ రిపోర్ట్ వెల్లడించింది. మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్ హైదరాబాద్‌లో భారీగా 14.1 మిలియన్ల చదరపు అడుగుల వైశాల్యంలో ప్రాజెక్టులను డెవలప్ చేస్తు న్నదని, నెక్సెస్ సెలెక్ట్ ట్రస్ట్ రిటైల్ రీట్ 0.8 మిలియన్ల చదరపు అడుగుల స్పేస్‌ను నగరంలో సొంతం చేసుకుందని తెలిపింది. ప్రైవేటు ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు సైతం జోరుగా వస్తున్నాయని, హైదరాబాద్, బెంగళూరు, పూణె నగరాలు 20 బిలియన్ డాలర్ల పీఈ పెట్టుబడుల్ని ఆకర్షించాయని వివరించింది. ఇందులో హైద రాబాద్ 4.836 బిలియన్ డాలర్ల ప్రైవేట్ ఈక్విటీ వాటా సాధించి, పెట్టుబడులకు ప్రధానకేంద్రంగా నిలిచిందని తాజా నివేదిక పేర్కొంది.






