ఫిబ్రవరిలో హైదరాబాద్ ఓపెన్ గోల్ఫ్ టోర్నీ
హైదరాబాద్, డిసెంబర్ 15 : మరో అతిపెద్ద గోల్ఫ్ ఈవెంట్‌కు హైదరాబాద్ వేదిక కాబోతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ ఓపెన్ గోల్ఫ్ టోర్నమెంట్‌కు నగరం ఆతిథ్యమివ్వనుంది. టీ గోల్ఫ్ ఫౌండేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీకి సంబంధించిన పోస్టర్‌ను గచ్చిబౌలీ బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ క్లబ్‌లో ఆవిష్కరించారు. భారత ప్రీమియర్ అమెచ్యూర్ గోల్ఫ్ చాంపియన్‌షిప్‌గా పిలిచే ఈ పోటీలు ఫిబ్రవరి 18 నుంచి 21 వరకూ జరగనున్నాయి.
దేశవ్యాప్తంగా టాప్ అమెచ్యూర్ గోల్ఫర్లు దీనిలో పాల్గొంటున్నట్టు నిర్వాహకులు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిన బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ కోర్సులో టాప్ గోల్ఫర్ల మధ్య అద్భుతమైన పోటీ జరుగుతుందని తెలిపారు. దీనిలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్లు ఓపెన్ చేసినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్ ఇండియా బిజినెస్ హెడ్ మధుసూదన్ రావు, టీ గోల్ఫ్ ఫౌండర్ ఎన్‌ఆర్‌ఎన్ రెడ్డి, బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ క్లబ్ జీఎం పాపిరెడ్డి, ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.




