16-12-2025 12:00:00 AM
రీప్లేస్‌మెంట్‌గా షాబాజ్ అహ్మద్
లక్నో, డిసెంబర్ 15: టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్‌కు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ దూరమయ్యాడు. అనారోగ్యంతో మిగిలిన రెండు మ్యాచ్‌ల నుంచి అతను తప్పుకున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. బీసీసీఐ మెడికల్ టీమ్ అతన్ని పర్యవేక్షిస్తున్నట్టు తెలిపింది. అతని స్థానంలో షాబాజ్ అహ్మద్‌ను ఎంపిక చేశారు. నాలుగో టీ20కి ముందే షాబాజ్ అహ్మద్ జట్టుతో చేరనున్నాడు. ధర్మశాల వేదికగా జరిగిన మూడో టీ20లోనూ అక్షర్ పటేల్ ఆడలేదు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు అతని స్థానంలో చోటు దక్కింది.
తొలి రెండు టీ ట్వంటీల్లో ఆడిన అక్షర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. రెండు మ్యాచ్‌లలో కలిపి 44 పరుగులు చేసిన ఈ ఆల్‌రౌండర్ 3 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి టీ ట్వంటీలో భారత్ గెలిస్తే.. తర్వాతి మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలిచి సిరీస్‌ను సమం చేసింది. అయితే మూడో టీ ట్వంటీలో భారత్ సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించి సిరీస్‌లో ఆధిక్యాన్ని అందుకుంది.