9 April, 2026 | 10:43 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

మళ్లీ వస్తా.. మ్యాచ్ ఆడతా

16-12-2025 12:00 AM
  1. భారత్ ఫ్యాన్స్‌తో మెస్సీ 
  2. ముగిసిన సాకర్ దిగ్గజం టూర్

న్యూఢిల్లీ, డిసెంబర్ 15 : ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత్ పర్యటన ముగిసింది. మూడు రోజుల పర్యటనలో భాగం గా కోల్‌కతా, హైదరాబాద్, ముంబైలలో ఫ్యాన్స్‌ను అలరించిన మెస్సీ చివరిరోజు న్యూఢిల్లీలో సందడి చేశాడు. ఊహించినట్టుగానే ఈ సాకర్ దిగ్గజానికి న్యూఢిల్లీలోనూ అభిమానులు బ్రహ్మరథం పట్టారు. కోల్‌కత్తా ఘటన అనుభవంతో మిగిలిన మూడు నగరాల్లోనూ అత్యంత పకడ్బందీగా ఏర్పా ట్లు చేయడంతో మెస్సీ టూర్ ప్రశాంతంగా ముగిసింది.

చివరిరోజు న్యూఢిల్లీ టూర్‌లో మెస్సీతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వీఐపీలు క్యూ కట్టి నట్టు తెలుస్తోంది. మెస్సీతో కరచాలనం, ఫోటో అవకాశం కోసం వీరంతా కోటి రూ పాయల వరకూ చెల్లించేందుకు సిద్ధపడినట్టు వార్తలు వచ్చాయి. కాగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ఎగ్జిబిషన్ మ్యాచ్ అనంతరం స్టేడియానికి వచ్చిన మెస్సీకి అభిమానులు స్టాండింగ్ ఒవేషన్‌తో గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు.

ప్లేయర్స్‌తో కరచాలనం చేసిన అనంతరం స్టేడియం అంతటా తిరుగుతూ ఫ్యాన్స్‌కు అభివాదం చేసాడు. తర్వాత ఐసీసీ ఛైర్మన్ జైషా మెస్సీని కలిసి భారత క్రికెట్ జట్టు జెర్సీలను, బ్యాట్‌నూ బహుమతిగా అందజేశాడు. వచ్చే ఏడాది జరగనున్న టీ ట్వంటీ ప్రపంచకప్‌లో భారత్, యూఎస్‌ఏ మ్యాచ్‌కు రావాలని ఆహ్వానిస్తూ దానికి సం బంధించిన టికెట్‌కు బహకరించాడు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీ కూడా హాజ రయ్యారు.

ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశిస్తూ మెస్సీ మాట్లాడాడు. తాము మరోసారి భారత్‌కు వస్తామని, అప్పుడు ఖచ్చితం గా ఒక మ్యాచ్ ఆడతామని మాట ఇచ్చాడు. తమపై భారత అభిమానులు, ప్రజలు చూ పిన అభిమానానికి కృతజ్ఞతలు చెప్పాడు. స్టేడియాలకు ఇంతటి భారీ స్థాయిలో అంద రూ తరలివచ్చి స్వాగతం పలకడం తాము ఎన్నటికీ మరిచిపోలేమని చెప్పాడు. ఏదో ఒక సందర్భంలో మరోసారి వచ్చి ఖచ్చితంగా మ్యాచ్ ఆడతామని చెబుతూ ముగించాడు.

మెస్సీ చివరిరోజు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావాల్సి ఉండగా చివరి నిమిషంలో రద్దయింది. 21 నిమిషాల సమా వేశం ఖరారైనప్పటకీ.. మోదీ విదేశీ పర్యటన కారణంగా రద్దు చేశారు. ఇక అరుణ్ జైట్లీ స్టేడియంలో కార్యక్రమం తర్వాత మరో ప్రైవే ట్ ఈవెంట్‌లో మెస్సీ భారత క్రికెటర్ రోహిత్‌శర్మ, బాక్సర్ నిఖత్ జరీన్‌తో పాటు మరి కొందరు స్పోర్ట్స్ సెలబ్రిటీలను కలిసాడు.