30 May, 2026 | 11:25 PM

Breaking News

ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు   •   ఖాతాదారుల సేవా కేంద్రం నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం   •   గిరిజన యువతీ యువకులకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం   •   మండల టాపర్‌ మేకా మాన్వితకు ట్రిపుల్ ఐటీ సీటు   •   పెద్దమల్లారెడ్డిలో అగ్నిప్రమాదం.. గడ్డివాము, ట్రాక్టర్ దగ్ధం   •   వరికొయ్యలు కాల్చవద్దు... బహిరంగ వ్యర్ధాలు కాల్చవద్దు   •   కూచిపూడి నృత్యంతో అలరించిన మోక్ష ధృతి   •   అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులను చేర్పించాలి: సీడీపీవో జ్యోతి   •   ఘట్కేసర్ లో ప్రారంభమైన సిపిఎం శిక్షణ తరగతులు   •   రైతు డిస్కమ్ రైతాంగానికి శాపం   •  

హైదరాబాద్ ఓపెన్ విజేత అమూల్య

22-02-2026 01:10 AM

ముగిసిన అమెచ్యూర్ గోల్ఫ్ ఛాంపియన్‌షిప్

హైదరాబాద్, ఫిబ్రవరి 21: అమెచ్యూర్ గోల్ఫర్స్ కోసం నిర్వహించిన హైదరాబాద్ ఓపెన్ గోల్ఫ్ ఛాంపియన్ షిప్ ఉత్సాహంగా ముగిసింది. మహిళా గోల్ఫర్ అమూల్య ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచింది. టీ గోల్ఫ్ ఫౌండేషన్, బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ క్లబ్ సం యుక్తంగా నిర్వహించిన ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 300 మందికి పైగా అమెచ్యూర్ గోల్ఫర్లు పాల్గొన్నారు. పోటీలు ఆద్యంతం హో రాహోరీగా సాగాయి. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముగింపు వేడుకలకు హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు.

గోల్ఫ్‌కు హైదరాబాద్ చిరునామాగా మారడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రీడ ద్వారా తెలంగాణ టూరిజం కూడా అభివృద్ధి చెందు తోందని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ టోర్నీని నిర్వహించిన టీ గోల్ఫ్ ఫౌండేషన్ ఫౌండర్ డా.ఎన్‌ఆర్‌ఎన్ రెడ్డిని గవర్నర్ అభినందించారు. హైదరాబాద్ ఓ పెన్ శ్రేష్ఠత, క్రమశిక్షణ మరియు భారతదేశంలో ఔత్సాహిక గోల్ఫ్ యొక్క పెరుగుతు న్న వేగానికి శక్తిమంతమైన సాక్ష్యంగా నిలుస్తుందనీ డాక్టర్ ఎన్‌ఆర్‌ఎన్ రెడ్డి చెప్పారు.