9 April, 2026 | 8:29 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

పాక్, కివీస్ మ్యాచ్ వర్షార్పణం

22-02-2026 01:12 AM

కొలంబో, ఫిబ్రవరి 21: టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో కొలంబో వేదికగా జరగాల్సిన న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో ఇరు జట్లకు తలో పాయింట్ లభించింది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు టాస్ పడింది. అయితే టాస్ వేసిన కొద్దిసేపటికే వర్షం ప్రారంభమైంది. మైదానం మొత్తం కవర్లతో కప్పేశారు.

దాదాపు రెండున్నర గంటల నిరీక్షణ తర్వాత కూడా వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. సూపర్-8 గ్రూప్-2లో ఉన్న ఈ రెండు జట్లకు ఇదే మొదటి మ్యాచ్.  అయితే మొదటి మ్యాచే రద్దు కావడంతో, సెమీస్ చేరాలంటే తర్వాత జరగబోయే మ్యాచుల్లో ఇరు జట్లు కచ్చితంగా గెలవాల్సిందే. న్యూజిలాండ్ తమ తదుపరి మ్యాచ్లో బుధవారం శ్రీలంకతో తలపడనుంది. పాక్ ఫిబ్రవరి 24న ఇంగ్లండ్తో ఆడనుంది.