calender_icon.png 22 February, 2026 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ‘స్కిల్-స్ప్రింట్ 2.0’

22-02-2026 12:35:21 AM

24 గంటల పాటు సుదీర్ఘంగా హ్యాకథాన్ నిర్వహణ

శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన కార్యక్రమం

భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం, దేశ్‌ముఖి లోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ‘స్కిల్-స్ప్రిం ట్ 2.0’ పేరుతో నిర్వహించిన 24 గంటల సుదీర్ఘ హ్యాకథాన్ శనివారం ఘనంగా ముగి సింది. సీఎస్‌ఈ, ఏసీఎస్‌ఈ డిపార్ట్‌మెంట్‌ల సంయుక్త ఆధ్యర్యంలో నిర్వహించిన ఈ హ్యాకథాన్ శుక్రవారం ఉదయం 9 గంటల కు ప్రారంభమై శనివారం ఉదయం 9 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగింది.

ప్రధానంగా ‘సస్టైనబిలిటీ అండ్ ఎన్వి రాన్మెంట్’ అంశంపై విద్యార్థులు తమ వినూ త్న ప్రాజెక్టులను ప్రదర్శించారు. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను గ్లోబల్ డేటా కంపెనీకి చెందిన డెవలప్మెంట్ మేనేజర్ శివ కుమార్ బొమ్మి, ప్రాక్టీస్ హెడ్ శీరం నాగే శ్వర రావులు ‘టెర్మినల్ ఎవాల్యూయేట ర్స్’గా వ్యవహరించి నిశితంగా పరిశీలించా రు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా విజ్ఞాన్స్ యూని వర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వర రావు  ప్రసంగిస్తూ ప్రతి ఒక్క విద్యార్థి సమా జానికి, ప్రజలకు ఉపయోగపడేటువంటి తమ వినూత్న ఆలోచనలను ఆచరణలోనికి తీసుకురాగలిగితే అద్భుతాలు సృష్టించవ చ్చని అన్నారు.

ఇటువంటి హ్యాకథాన్లు విద్యార్థులలో టీమ్ వర్క్, ప్రాక్టికల్ ఆలోచ నా దృక్పథాన్ని పెంపొందిస్తాయన్నారు. విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమి తం కాకుండా, ఇష్టంతో కొత్త ప్రయోగాలు చేయడం ద్వారా ఇంజినీరింగ్ రంగం పరం గా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు వెతకాలని సూచించారు.సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, రవాణా, వ్యవసాయం వంటి ఏ రంగం తీసుకున్నా అందులో ఇంజినీర్ల పాత్రే కీలక మని, విద్యార్థులు తమ ఐడియాలను స్టార్ట ప్స్‌గా మార్చుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. విజ్ఞాన్స్ యూనివర్సిటీ అడ్వైజర్, రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య మాట్లాడుతూ మారుతున్న కాలానికి, సాంకేతిక విప్లవానికి అనుగుణంగా విద్యార్థులు నిరంతరం తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా సస్టైనబిలిటీ వంటి అంశాల్లో విద్యార్థులు చూపిన చొరవను ఆమె అభినందించారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, డైరెక్టర్లు, హెచ్‌ఓడీలు, అధ్యాపకులు విద్యార్థులు  పాల్గొన్నారు.