SRH vs RCB Match.. IPL టికెట్ల పేరుతో సైబర్ మోసాలు..!
క్రికెట్ అభిమానులు తస్మాత్ జాగ్రత్త!
ఐపీఎల్ టికెట్ బుకింగ్ ఫేక్ యాప్స్
ఐపీఎల్ టికెట్ బుకింగ్స్.. ఫేక్ యాప్స్ పట్ల జాగ్రత్త!
హైదరాబాద్: IPL మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేసే ముందు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీసులు(Hyderabad Police) క్రికెట్ అభిమానులను హెచ్చరించారు. మే 22న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరగనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Sunrisers Hyderabad vs Royal Challengers Bangalore) జట్ల మధ్య జరిగే మ్యాచ్‌పై ఉన్న భారీ క్రేజ్‌ను సైబర్ నేరగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. ఎస్ఆర్హెచ్ (SRH Fans) అభిమానులలో టిక్కెట్ల కోసం ఉన్న డిమాండ్‌ను అవకాశంగా తీసుకుని, వారిని దోపిడీ చేయడానికి నకిలీ యాప్‌లు(Fake Apps), వెబ్‌సైట్‌లను ప్రారంభించారు. ప్రస్తుతం, ఐపీఎల్ టిక్కెట్ బుకింగ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో అనేక ప్రకటనలు కనిపిస్తున్నాయి.
తక్కువ ధరకే ఐపీఎల్ టికెట్లు.. సోషల్ మీడియాలో ప్రకటనలు
ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media) వేదికగా ఐపీఎల్ టికెట్ల బుకింగ్‌కు సంబంధించి అనేక ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. అధికారిక టికెటింగ్ భాగస్వామి అయిన 'డిస్ట్రిక్ట్' (District) యాప్‌ను పోలిన రంగులు, లోగోలతో ఉన్న నకిలీ యాప్‌లను సృష్టించి, తక్కువ ధరకే టికెట్లు ఇస్తామంటూ క్రికెట్ అభిమానులను(Cricket fans) ఊరిస్తున్నారు. SRH vs RCB Match టికెట్ల విక్రయాల పేరుతో సైబర్ మోసాలు. ప్రకటనలు చూసి నిజమని నమ్మి అభిమానులు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఫేక్ వెబ్ సైట్లు, లింకుల ద్వారా టికెట్లు బుక్ చేయవద్దని పోలీసులు హెచ్చరించారు. ఫేక్ వెబ్ సైట్ల(Fake websites) ద్వారా బుక్ చేస్తే మోసపోయే ప్రమాదం ఉందని పోలీసులు తెలిపారు. బ్యాంకింగ్ వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే అవకాశముందని పోలీసులు హెచ్చరించారు.






