17 May, 2026 | 2:22 AM

మహిళల క్రికెట్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ

17-05-2026 01:08 AM

పాక్ ప్లేయర్‌ఫాతిమా సనా రికార్డు

కరాచీ, మే 16 : మహిళల టీ20 క్రికెట్‌లో పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగ వంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేసిన మహిళా క్రికెటర్‌గా రికార్డులకెక్కింది. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఫాతిమా సనా కేవ లం 15 బంతుల్లోనే 50 పరుగులు చేసింది. గతంలో న్యూజిలాండ్ క్రికెటర్ సోఫీ డివైన్, ఆస్ట్రేలియాకు చెందిన ఫోబ్ లిచ్‌ఫీల్డ్, భారత్ వికెట్ కీపర్ రిచా ఘోష్ పేరిట ఈ రికార్డు ఉండేది.

ఈ ముగ్గురు కేవలం 18 బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. తాజాగా ఫా తిమా సనా వీరి రికార్డును బద్దలు కొట్టింది. గతంలో పాక్ తరపున ఈ రికార్డు నిదాదార్ పేరిట ఉండేది. ఈ మ్యాచ్‌లో ఫాతిమా సనా కేవలం 19 బంతుల్లోనే 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. ఆమెతో పాటు  సైరా జబీన్ (50 నాటౌట్), అయేషా జాఫర్ (45) కూడా చెలరేగడంతో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. 224 పరుగుల భా రీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే చేతులెత్తేసింది. 17.1 ఓవర్లలో 90 పరుగులకే ఆలౌటైంది.