30 June, 2026 | 2:10 AM

హైదరాబాద్ ఈ చాంపియన్స్ జైత్రయాత్ర

30-06-2026 12:27 AM

హైదరాబాద్, జూన్ 29: తెలంగాణ టీ20 లీగ్‌లో హైదరాబాద్ ఈ- ఛాంపియన్స్‌కు ఎదురే లేకుండా పోయింది. అద్భుతంగా రాణిస్తున్న ఆ జట్టు వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఖమ్మం ఏసెస్ జట్టుపై 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ భారీస్కోరు సాధించింది. కెప్టెన్ అభిరథ్ రెడ్డి హాఫ్ సెంచరీతో రాణించాడు.

కేవలం 26 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 59 రన్స్‌కు వెనుదిరిగాడు. గడుగు(44), అన్విత్‌రెడ్డి (32) ఆకట్టు కున్నారు. ఛేజింగ్‌లో ఖమ్మం ఏ సెస్ పెద్దగా పోటీనివ్వలేకపోయింది. హిమతేజ(65) రన్స్ తప్పిస్తే మిగిలిన బ్యాటర్లంతా విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో శ్రీనికేత్ 3, దేవ్ గౌడ 2 వికెట్లు పడగొట్టారు.