క్రికెట్‌లోకి రాజకీయాలు తీసుకురావొద్దు
ఒక రాష్ట్రానికి ఒకటే అసోసియేషన్
హెచ్‌సీఎ ప్రతినిధి శేష్ నారాయణ్
హైదరాబాద్, జూన్ 29: క్రికెట్‌లోకి రాజకీయాలు తీసుకురావొద్దని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధి శేష్‌నా రాయణ్ వ్యాఖ్యానించారు. ఆటను ఆటలాగే చూడాలని హితవు పలికారు. హెచ్‌సీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న టీజీ20 లీగ్‌కు బీసీసీఐ అన్ని అనుమతులు ఉన్నాయని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు రాజ్యాంగం ప్రకారమే హెచ్‌సీఏ నడుస్తోందన్నారు. 1934 నుంచే హెచ్‌సీఏ ఉనికిలో ఉందనీ, బీసీసీఐ ఏర్పాటులో ప్రధాన సభ్యులలో ఒకటిగా ఉంద న్నారు. హెచ్‌సీఏ కేవలం హైదరాబాద్‌కే పరిమితమైందన్న ఆరోపణలు అవాస్తవమన్నారు.
జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి కోసం తాము కృషి చేస్తున్నామని చెప్పారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ప్రతీ రాష్ట్రానికీ ఒకే ఒక్క గు ర్తింపు పొందిన క్రికెట్ అసోసియేషన్ ఉం టుందన్నారు. హెచ్‌సీఏ గుర్తింపు పొందిన సంస్థగా ఉన్నప్పుడు మరొక సమాంతర అసోసియేషన్‌కు అవకాశమే లేదన్నారు. జిల్లాల నుంచి వచ్చే ఆటగాళ్లకు హెచ్‌సీఏ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. లీగ్ మ్యాచ్‌ల ద్వారా 80 మంది గ్రామీణ యువకులకు అవకాశం లభిస్తోందన్నారు. ప్రస్తుతం నగరాలకే పరిమితమైన అకాడమీలను జిల్లాలకు కూడా విస్తరించి మహిళా క్రికెట్ కోచింగ్ సెంటర్లను సైతం ఏర్పాటు చేస్తామని తెలిపారు.






