30 June, 2026 | 2:11 AM

హెచ్‌సీఏకు బీసీసీఐ అంబుడ్స్‌మన్ నోటీసులు

30-06-2026 12:25 AM

4 వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశం

మాజీ క్రికెటర్ గౌరవ్ శర్మ ఫిర్యాదుపై స్పందన

హెచ్‌సీఏ ఉల్లంఘనలకు పాల్పడిందని ఫిర్యాదు

చట్టం ముందు జవాబుదారీగా ఉండాల్సిందే : టీసీఏ

హైదరాబాద్, జూన్ 29: తెలంగాణ క్రికెట్ పరిపాలనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత సుప్రీంకోర్టు మాజీ న్యా యమూర్తి, బీసీసీఐ అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్ జస్టిస్ అరుణ్ మిశ్రా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కు అధికారిక నోటీసు జారీ చేశారు.

బీసీసీఐ రాజ్యాంగం, సుప్రీంకోర్టు ఆమోదించిన పరిపాలనా సంస్కరణలు, జస్టిస్ లోధా కమిటీ సిఫార్సు ల అమలులో హెచ్‌సీఏ తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిందంటూ మాజీ క్రికెటర్లు దా ఖలు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిని పరిశీలించిన అనంతరం నాలుగు వారాల్లో సమగ్ర సమాధానం దాఖలు చేయాలని ఆ దేశించారు. ఫిర్యాదు ప్రతితో పాటు నోటీసు ను వెంటనే హెచ్‌సీఏకు అందజేయాల ని, అనంతరం ఫిర్యాదుదారులు అవసరమైతే రీజాయిండర్ దాఖలు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించారు.

సభ్యత్వ వర్గీకరణ, కొత్త రాష్ట్రాల గుర్తింపు, వార్షిక ఆడిట్లు వంటి అనేక కీలక అంశాల్లో రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిందని ఆరోపించారు. అదేవిధంగా, సుప్రీంకోర్టు ఆమోదించిన బీసీసీఐ పాలనా వ్యవస్థకు విరుద్ధంగా హెచ్‌సీఏ తన రాజ్యాంగాన్ని సవరించిందని, బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం అసోసియేట్ సభ్యులుగా మాత్రమే ఉండాల్సిన సంస్థాగత సభ్యులకు పూర్తి సభ్యత్వం కల్పించిందని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. వ్యాఖ్యానించారు.