29 June, 2026 | 1:13 AM

రగ్బీ లీగ్ విజేత హైదరాబాద్

29-06-2026 12:53 AM

హైదరాబాద్, జూన్ 28: హెచ్‌ఎస్‌బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ టైటిల్‌ను హైదరాబాద్ హీరోస్ కైవసం చేసుకుంది. గచ్చిబౌలీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యా చ్‌లో హైదరాబాద్ హీరోస్ 41 స్కోరు తో ముంబై డ్రీమర్స్‌పై గెలిచింది.

జీఎంఆర్ స్పోర్ట్స్, రగ్బీ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన ఈ లీగ్ ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ ఛైర్మన్ కిరణ్ కుమార్ గ్రంథి, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, నటి మృణాల్ ఠాకూర్, రగ్బీ ఇండియా ప్రెసిడం ట్ రాహుల్ బోస్ హాజరయ్యారు.

ఛాంపియన్‌గా నిలిచిన హైదరాబాద్ హీరోస్ జట్టు కు రూ.45 లక్షలు, రన్నరప్ ముంబైకి రూ. 25 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది. అంతకుముం దు మూడో స్థానం కోసం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో చెన్నై బుల్స్‌ను ఓడించిన బెంగళూరు రూ.15 లక్షల ప్రైజ్‌మనీ అందుకుంది. రగ్బీకి దేశంలో మరింత ఆదరణ పెంచడమే లక్ష్యంగా ఆర్‌పీఎల్‌ను నిర్వహిస్తున్నట్టు  లీగ్ కమిషనర్ రాహుల్ బోస్ చెప్పారు.