నేనెప్పటికీ నీ అభిమానినే..
నటుడు రానా, సమంతల మధ్య మంచి అనుబంధం ఉంది. రానాను సమంత తన సోదరుడిగా భావిస్తారు. శనివారం రానా పుట్టినరోజు సందర్భంగా సమంత శుభాకాంక్షలు తెలిపారు. ఇన్‌స్టా స్టోరీస్ వేదికగా రానాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్ట్ పెట్టారు. “హ్యాపీ బర్త్‌డే రానా. ప్రతి పనిలోనూ 100 శాతం శ్రమిస్తారు. ఆ శ్రమించేతత్వం నాలో ఎంతో స్ఫూర్తిని నింపడమే కాకుండా ప్రతి పనిలోనూ అది నాకు ఇంకా బాగా చేసేలా ప్రోత్సహిస్తుంది.
నేనెప్పటికీ నీ అభిమానినే. దేవుడి ఆశీస్సులు మీకుండాలని కోరుకుంటున్నా” అంటూ సమంత పోస్ట్ పెట్టారు. ‘బెంగుళూరు డేస్’ అనే తమిళ మూవీ రీమేక్ కోసం రానా సమంత కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న సమయంలో వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ‘జిగ్రా’ ఈవెంట్‌లోనూ.. ప్రతి అమ్మాయికి రానాలాంటి సోదరుడు ఉండాలని సమంత చెప్పారు. సమంత ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు.






