పార్టీ పనంతా నేనే జేస్తున్నా!
బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ పేరు దా దాపుగా ఖరారు అయ్యిందనే చర్చ నడుస్తోంది. మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం అధ్య క్షుడిగా ఉన్న బండి సంజయ్, కిషన్‌రెడ్డి లు ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా బిజీ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలు చూసేందుకు వారికి వీలు కావట్లేదు. అడపాదడపా వస్తున్నా పార్టీ వ్యవహారాలపై పెద్దగా దృష్టి సారించడం లేదని చర్చ నడుస్తోంది. కేంద్ర మంత్రు లు బిజీబిజీగా ఉన్నారని.. పార్టీ వ్యవహారాలకు తానే పెద్ద దిక్కని, 24 గంటలు పార్టీ కోసమే పనిచేస్తున్నానని ఈటల రాజేందర్ చెప్పుకొంటున్నట్టు తెలుస్తోం ది. ఎలాగూ కాబోయే అధ్యక్షుడు తానే కాబట్టి పార్టీ కోసం ఫుల్ టైం కష్టపడుతున్నట్టు ఆయన మాటల సారాంశంగా పా ర్టీ నేతలు చెప్తున్నారు. పార్టీ ఎవరికి అధ్య క్ష బాధ్యతలు కట్టబెడుతుందో చూడాలి.






