11 July, 2026 | 8:35 PM

Breaking News

జవహర్ నవోదయలో ప్రవేశాలకు ఆహ్వానం   •   గోపాల్ కుటుంబానికి అండగా ఉంటాం.. రూ.1 లక్ష ఆర్థిక సాయం: మాజీ మంత్రి కేటీఆర్   •   అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం   •   దివ్యాంగురాలిని ఆప్యాయంగా పలకరించిన జిల్లా కలెక్టర్   •   పినపాక మండలంలో ఎస్ఐఆర్ ప్రోగ్రామ్   •   శాతవాహన క్రీడా మైదానంలో 'సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్' నిర్మాణానికి భూమి పూజ   •   ఈనెల 13న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటన   •   మొదటి వేతనంతో పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన సర్పంచ్   •   లింగాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   మత్తు పదార్థాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •  

ముత్తారం హనుమాన్ టాటా మ్యాజిక్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక

10-07-2026 06:37 PM

అధ్యక్షుడిగా అడ్డూరి భాస్కర్

ముత్తారం,(విజయక్రాంతి) ముత్తారం మండల కేంద్రంలో శ్రీ హనుమాన్ టాటా మ్యాజిక్ డ్రైవర్స్, ఓనర్స్ వెల్ఫేర్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనియన్ నూతన అధ్యక్షుడిగా అడ్డూరి భాస్కర్, ఉపాధ్యక్షుడిగా మర్రి రాజ్ కుమార్, క్యాషియర్ (కోశాధికారి)గా సంకుర్తుల రాజేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ... యూనియన్ సభ్యులందరి సంక్షేమానికి శ్రమిస్తామని, డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి నిరంతరం అండగా ఉంటామని పేర్కొన్నారు.

తమపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల కార్యక్రమంలో యూనియన్ సీనియర్ సభ్యులు తోట సమ్మయ్య, తాత తిరుపతి, ఈరబోయిన రమేష్, కసూరి రమేష్, విరబోయిన అజయ్, కలవేన రాజశేఖర్, తగరం వేణు, ఎడ్ల శంకర్, ఎర్ర నరేష్, రత్న ప్రశాంత్ తదితర మ్యాజిక్ వాహన యజమానులు, డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన కమిటీకి తోటి డ్రైవర్లు శుభాకాంక్షలు తెలిపారు.