11 July, 2026 | 9:38 PM

Breaking News

ఆకట్టుకున్న ఐవీవై, సిద్ధార్థ రోబోటిక్స్ ఎక్స్ పో   •   సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షుని ఎన్నిక   •   సుల్తానాబాద్ శ్రీ శివాలయంకు లలిత అమ్మవారి విగ్రహం అందజేత   •   జిల్లా కమిటీలో ఎన్నికైన పటాన్‌చెరు జర్నలిస్టులకు ఘన సన్మానం   •   ఆవుపై చిరుత దాడి   •   'పేదల కన్నీళ్లు తుడవడమే ప్రభుత్వ లక్ష్యం'   •   కోనరావుపేటలో ఘనంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు   •   బేగంపేటలో దొంగల హల్‌చల్.. 20 పంపుసెట్ల విద్యుత్ కేబుళ్ల చోరీ   •   ఉద్యమానికి సిద్ధం.. 17న మందకృష్ణ మాదిగ రాక   •   బాధిత కుటుంబాలను పరామర్శించిన బీఆర్ఎస్ నేత చల్మెడ   •  

నేనే రాజు.. నేనే మంత్రి!

27-08-2024 12:22 AM

కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి నిధుల కోసం సంబంధిత శాఖలకు చెందిన కేంద్ర మంత్రులను సీఎంతో పాటు ఆయా శాఖలకు చెందిన మంత్రులు కలిసి వినతులు ఇస్తుంటారు. కేంద్రం నిధులు ఇస్తుందా? ఇయ్యదా? అనేది పక్కన పెడితే, కొందరు రాష్ట్ర మంత్రులు మాత్రం ఒకరి శాఖలో మరొకరు జోక్యం చేసుకుంటున్నారట. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ పనుల కోసం హస్తినకు వెళ్లారు. రాష్ట్రానికి టీ ఫైబర్ కోసం కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్యను సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిశారు. అయితే, అక్కడ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కూడా ఉండి ఉంటే బాగుండేదనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతుందట.

ఇక మరో మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా కేంద్ర మంత్రి నితీన్‌గడ్కరిని కలిసి రాష్ట్రానికి రోడ్ల విస్తరణకు నిధులు ఇవ్వాలని కోరాడు. రోడ్ల మంత్రి ఏమో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. జూపల్లి వద్ద ఎక్సైజ్, పర్యాటక శాఖలున్నాయి. రాష్ట్రానికి ఎన్ని రోడ్లు కావాలో.. రోడ్ల శాఖ మంత్రి వెంకట్‌రెడ్డికి తెలుస్తుంది.. ఎక్సైజ్ శాఖ మంత్రికి ఏమి తెలుసబ్బా! అని జనంలో చర్చ జరుగుతుందట. ఏదైతే ఏంది కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతా నా యిష్టం అన్నట్లుగానే ఉంటుంది కదా? అని చర్చ ఈ నోటా, ఆ నోటా చక్కర్లు కొడుతోంది.