14 May, 2026 | 9:49 PM

ముందు కూల్చు.. ఆపై ఓదార్చు

27-08-2024 12:24 AM

ప్రభుత్వ భూములు కబ్జా, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ కట్టడాలపై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. హైడ్రాను ఏర్పాటు చేసిన సర్కా ర్.. దానికి ఓ పోలీస్ ఆఫీసర్‌ను నియమించి, ఫుల్ పవర్ ఇచ్చింది. ఫిర్యాదులు రావడమే తరువాయి హైడ్రా అక్కడ వా లిపోవడం.. అక్రమ కట్టడాలను కూల్చేయడం చూస్తుండగానే జరిగిపోతోంది. ప్రధానంగా రాజకీయ, సినీ ప్రముఖులకు చెందిన అక్రమ కట్టడాలను హైడ్రా నేటమట్టం చేసేస్తుంది. అయితే, ఆ తర్వా త ప్రభుత్వానికి, అధికార పార్టీకి చెందిన కొందరు పెద్దలు బాధితుల వద్దకు  వెల్లి ఓదార్పులు చేస్తున్నారట. ఏపీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు సోదరుడి భవనం, సినీ నటడు అక్కినేని నాగార్జునతోపాటు మరికొందరు అక్రమంగా నిర్మించిన భవనాలు, ఫంక్షన్‌హాళ్లను హైడ్రాను ముందు పెట్టి సర్కార్ ధ్వంసం చేసింది.

హైదరాబాద్‌కు చెందిన మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సైతం నగరంలోని ఓ భూమి విషయంలో డమ్కీ ఇచ్చారు. వీళ్లలో కొందరు పెద్దలు సోసైటీలో తమ పరువు, ప్రతిష్ట పోతుందని, కూల్చి వేతలు ఆపాలని వివిధ మార్గాల ద్వారా సర్కార్‌పై  ఒత్తిడి  తీసుకొస్తున్నారట. అయితే  హైడ్రాను ముందుపెట్టి కూల్చడం.. ఆ తర్వాత పరామర్శలు చేయడంలో మతలబేంటోనని? జనం చెవులు కొరుక్కుంటున్నారు.