11 July, 2026 | 8:34 PM

Breaking News

జవహర్ నవోదయలో ప్రవేశాలకు ఆహ్వానం   •   గోపాల్ కుటుంబానికి అండగా ఉంటాం.. రూ.1 లక్ష ఆర్థిక సాయం: మాజీ మంత్రి కేటీఆర్   •   అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం   •   దివ్యాంగురాలిని ఆప్యాయంగా పలకరించిన జిల్లా కలెక్టర్   •   పినపాక మండలంలో ఎస్ఐఆర్ ప్రోగ్రామ్   •   శాతవాహన క్రీడా మైదానంలో 'సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్' నిర్మాణానికి భూమి పూజ   •   ఈనెల 13న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటన   •   మొదటి వేతనంతో పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన సర్పంచ్   •   లింగాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   మత్తు పదార్థాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •  

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మంథని నియోజకవర్గ నూతన కమిటీ నియామకం

10-07-2026 06:28 PM

మంథని,(విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆదేశాల మేరకు మలిదశ తెలంగాణ ఉద్యమకారులకు వివిధ పదవులను కేటాయిస్తూ నూతన నియామకాలు చేపట్టారు. మంథనిలోని విద్యార్థి వేదిక కార్యాలయంలో ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు మంథని విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శిగా ఎక్కేటి అనంతరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా వేల్పుల గట్టయ్య మంథని నియోజకవర్గ యువజన విభాగం కన్వీనర్ గా  మంథని సాయికుమార్ నియమించారు.

ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన నాయకులు మాట్లాడుతూ... మంథని నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా, వారి హక్కుల సాధన కోసం నిరంతరం కట్టుబడి పనిచేస్తామని స్పష్టం చేశారు. ఉద్యమకారుల సంక్షేమమే ధ్యేయంగా ఫోరమ్‌ను బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉద్యమకారులు రామడుగు మారుతీ రావు, జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం దేవేందర్, రొడ్డ లింగయ్య, ముస్కుల ప్రభాకర్ రెడ్డి, మాదాసి అనిల్ మరియు ఇతర ముఖ్య నాయకులు, ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.