17 April, 2026 | 9:43 AM

కాంగ్రెస్‌కు రుణపడి ఉంటా

29-12-2025 12:00 AM

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఉట్నూర్, డిసెంబర్ 28 (విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 100 ఏళ్లు పూర్తి చేసుకుందని, కాంగ్రెస్ పార్టీకి జీవితాంతం రుణపడి ఉంటానని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఉన్నారు.. ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఎగరవేశారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజల సం క్షేమాన్ని కృషి చేస్తుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి కార్యకర్త ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని పిలిపించారు.

కాంగ్రెస్ పార్టీ టికెట్ పై నేను ఎమ్మెల్యేగా మీ ముందు ఉన్ననని గుర్తు చేశారు.. తనను పార్టీ గుర్తిం చి ఎమ్మెల్యేగా చేసిందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తున్నానని అన్నారు.. ఉట్నూర్ మండల కేంద్రంలో పాటు నార్నూర్, గాదిగూడ, ఇంద్రవెల్లి, సిరికొండ మండల కేంద్రా ల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఎమ్మెల్యే తో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..