calender_icon.png 29 December, 2025 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్నతస్థాయికి ఎదగాలి

29-12-2025 12:00:00 AM

మల్టీపర్పస్ అగ్రికల్చరల్ మెషిన్ ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణం

గ్లోబల్ సమ్మిట్లో పాల్గొన్న విద్యార్థులకు జిల్లా కలెక్టర్ అభినందనలు

ఆదిలాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి) : సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపు చ్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా విద్యార్థులకు సూచించారు. ఈ నెల 8, 9 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించిన ప్రతిష్టాత్మక గ్లోబల్ సమ్మిట్ లో మహాత్మ జ్యోతి బాపూలే విద్యాలయం విద్యార్థులు వైష్ణవి, రానుష రూపొందించిన మల్టీపర్పస్ అగ్రికల్చరల్ మెషిన్ ప్రాజెక్టును ప్రదర్శించిన సందర్భంగా ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వారిని శాలువాల తో సన్మానించి, అభినందించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అం తర్జాతీయ స్థాయి సదస్సుల్లో పాల్గొనడం విద్యార్థుల భవిష్యత్కు ఎంతో ఉపయోగకరమని, ఇలాంటి అవకాశాలను సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. జాతీ య స్థాయి ఇన్‌ప్సురై అవార్డు 2023 24కు మల్టీపర్పస్ అగ్రికల్చరల్ మెషిన్ ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. ఒకే యంత్రంతో పలు వ్యవసాయ పనులు చేయగలిగే విధంగా ఈ ప్రాజెక్టును రూపకల్పన చేయడం ప్రశంసనీయమని, రైతులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

సదస్సులో వారు నేర్చుకున్న అంశాలు, పొందిన అనుభవాలను కలెక్టర్ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. చదువుతో పాటు నూతన సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు ఆకాంక్షించారు. జిల్లా తరఫున వెళ్లిన విద్యార్థులు సమ్మిట్లో చురుకుగా పాల్గొనడం పట్ల సం తోషం వ్యక్తం చేశారు. విద్యార్థులను ప్రోత్సహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం, సంబంధిత శాఖ ల సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, మహాత్మ జ్యోతి బాపూలే విద్యాలయం ప్రిన్సిపాల్ కీర్తి, ఉపాధ్యాయులు సుజాత, నీతి అయోగ్ ప్రోగ్రామ్ అధికారి రాహుల్ తదితరులు పాల్గొన్నారు.