పంటల సాగులో సేంద్రియ ఎరువులు వాడాలి
డ్రైలాండ్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ జీవీఎంఎస్ ప్రసాద్
ఉట్నూర్, డిసెంబర్ 28 (విజయక్రాంతి): వర్షాధారం పై పంటలు సాగు చేసే రైతులు సేంద్రియ ఎరువులను విరివిగా వాడాలని డ్రైలాండ్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ జే.వి.ఎన్.ఎస్ ప్రసాద్ ఉన్నారు. ఆదివారం ఇంద్రవెల్లి మండలం లోని దుర్వగూడ లో రైతు క్షేత్ర దినోత్సవాన్ని నిర్వహించారు.. ఈ సదస్సుకు ఉట్నూర్, ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, ఇచ్చోడ మండలాల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఆయన మాట్లా డుతూ... రసాయన ఎరువులు వాడడంతో పంటలు దిగుబడి తక్కువ వస్తుందని గుర్తు చేశారు.
సేంద్రియ ఎరువులు వాడడంతో భూసారం పెరగడంతో పాటు పంట దిగుబడి వస్తుందన్నారు. వర్షాధారంపై సాగు చేసి భూములలో పంట మార్పిడి తప్పనిసరిగా చేయాలని గుర్తు చేశారు.. ఈ కార్య క్రమంలో క్రీడా సంస్థ డైరెక్టర్ వికేసింగ్ మా ట్లాడుతూ.. తమ సంస్థ ద్వారా పశువుల పేడతో సేంద్రీయ ఎరువులు తయారు చేసే పరికరాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ డీడియం వీరభద్రుడు, ఎస్.టి.సి ప్రోగ్రాం నోడల్ అధికారి మనోరంజన్ కుమార్, క్రీడా సంస్థ శాస్త్రవేత్తలు పంకజ్ కుమార్, సంజీవరెడ్డి, కె.వి శ్రీ ధర్, కెవికె శాస్త్రవేత్త మోహన్ దాస్, సర్పంచ్ కడప శ్రీరామ్, రైతులు పాల్గొన్నారు.






