పొమ్మనలేక పొగబెట్టారు!

20-04-2024 12:25:00 AM

l ఇందూరు ఐడీసీఎంఎస్ చైర్మన్ రాజీనామా?

l ఎన్నికల వేళ బీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డికి షాక్

l నల్లవెల్లి పీఏసీఎస్‌లో కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం

నిజామాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాం తి): బీఆర్‌ఎస్ నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి బాజిరెడ్డి గోవర్థన్ కు కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. ఆయన ముఖ్య అనుచరుడు, ఇందూరు జిల్లా సహకార మార్కెటింగ్ సొసై టీ (ఐడీసీఎంఎస్) చైర్మన్ సాంబారి మోహన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టింది. పొమ్మనలేక పొగబెట్టి తనంతట తాను చైర్మన్ పదవికి రాజీనామా చేసేలా వ్యూహం పన్నింది. ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పలువురు స్థానిక సంస్థల ప్రతినిధులు కాంగ్రెస్‌లో చేరారు.

ప్రాథమిక సహకార సంఘాలతోపాటు స్థాని క సంస్థల్లో కాంగ్రెస్ బలపడింది. ఈ బలంతో స్థానిక సంస్థలు, పలు మునిసిపాలిటీలు, నిజామాబాద్ కోథై సెంట్ర ల్ బ్యాంకుల్లో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టి విజయం సాధించింది. తాజాగా నిజా మాబాద్ ఐడీసీఎంఎస్ చైర్మన్ మోహన్‌పై అవిశ్వాసం పెట్టేందుకు యత్నించింది. కాంగ్రెస్ పార్టీ ఐడీసీఎంఎస్‌లో అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు అవసరమైన బలం లేకపోవడంతో, ప్రత్యామ్నాయాలపై ఆలోచిం చింది. మోహన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లవెల్లి ప్రాథమిక సహకార సంఘంలో కాంగ్రె స్ బలంగా ఉండటంతో అక్కడ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ నోటీసులు ఇచ్చిం ది.

అవిశ్వాసం తప్పించుకునేందుకు మోహ న్ కాంగ్రెస్‌లో చేరేందుకు యత్నించినప్పటికీ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూప తిరెడ్డి అనుచరులు వ్యతిరేకించారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులకు వ్యతిరేకంగా మోహన్ వ్యవహరించడమే కారణమని చర్చ జరుగుతుంది. ప్రత్యామ్నాయం లేక మోహన్ శుక్రవారం స్వగ్రామం నల్లవెల్లి ప్రాథమిక సహకార సం ఘ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. దీం తో ఆయన నిజామాబాద్ ఐడీసీఎంఎస్ పదవిని కోల్పోవాల్సిని పరిస్థితి తలెత్తింది.