20 March, 2026 | 8:40 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

ఇంతలా ఆదరిస్తారని ఊహించలేదు

30-10-2024 12:00 AM

శివకుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కింది ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రం. శృతి జయన్, ఐశ్వర్య అనిల్‌కుమార్, వైవా రాఘవ, ఇతర ప్రముఖ తారాగణంతో వచ్చిన ఈ చిత్రానికి రిషికేశ్వర్ యోగి దర్శకత్వం వహించారు. టీజీ విశ్వప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధురెడ్డి నిర్మాతలు. అక్టోబర్ 25న విడుదలైన తమ సినిమాకు ప్రేక్షకాదరణ దండిగా లభిస్తోందని చెబుతోందీ చిత్రబృందం.

ఈ మేరకు వారు థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో శివకుమార్ రామచంద్రవరపు, దర్శకుడు రిషికేశ్వర్ యోగి మాట్లాడుతూ.. ‘మా సినిమాను ప్రేక్షకులు ఇంత బాగా ఆదరిస్తారని మేం కూడా ఊహించలేదు’ అన్నారు. ‘మాలాంటి కొత్తవారిని ప్రోత్సహిస్తుంటే ఇంకా మంచి చిత్రాలు చేస్తాం’ అని నిర్మాత సింధురెడ్డి అన్నారు.