నేను విలన్ పాత్రలకూ ఎప్పట్నుంచో సిద్ధంగా ఉన్నా!

09-09-2026 | 05:25am

సుమంత్(Sumanth), ఐశ్వర్య రాజేశ్(Aishwarya Rajesh) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. ఇందులో సిద్దు జొన్నలగడ్డ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రేక్షకులు ముందుకు రానుంది.

ఈ సందర్భంగా హీరో సుమంత్ విలేకరుల సమావేశంలో పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే.. “మహేంద్రగిరి వారాహి’ నా నుంచి వస్తున్న చాలా పెద్ద బడ్జెట్ సినిమా. హిందీ, తమిల్‌లోనూ రిలీజ్ అవుతోంది. నార్త్ ప్రేక్షకులూ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాం. ఈ కథ మొత్తం నాకు నచ్చింది. డైరెక్టర్ సంతోష్‌కు వేదాలు, పురాణాల పట్ల చాలా మంచి అవగాహన ఉంది. తనకిది చాలా రైట్ సబ్జెక్టు. తను అనుకున్న కథనున అంతే అద్భుతంగా తీశాడు. ఈ సినిమాలో - నేను యూట్యూబ్‌లో మూఢ నమ్మకాలను ఎక్స్‌పోజ్ చేసే పాత్రలో కనిపిస్తా. ఇది డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్. మంచి ఫ్యామిలీ డ్రామా కూడా ఉంది.

-ఈ మూవీ ట్రైలర్‌లో చూపించినట్టుగా 33 ఏళ్లు దాటితే ఆ వంశంలో వ్యక్తులు చనిపోతున్నారు అనేది ‘మురారి’ సినిమా పాయింట్‌ను గుర్తు చేసినప్పటికీ, ఇందులో కథ, స్క్రీన్‌ప్లే చాలా భిన్నంగా ఉంటాయి. కంప్లీట్‌గా డిఫరెంట్ సబ్జెక్ట్. -ఇందులో ఒక మూడు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. యాక్షన్ బ్లాక్స్ చాలా ఉంటాయి. -యాక్షన్ నాకిష్టం. గతంలోనూ చాలా యాక్షన్ సినిమాలు చేశా. మంచి యాక్షన్ కథ వస్తే కచ్చితంగా చేస్తా. విలన్ పాత్రలకు కూడా -నేను ఎప్పటినుంచో సిద్ధంగా ఉన్నా. బలమైన సపోర్టింగ్ క్యారెక్టర్ చేయడానికీ నేను రెడీ. నా నుంచి రాబోయే సినిమాల గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను. -కొన్ని కథలు విన్నా. ఇంకా ఏదీ ఫైనల్ చేయలేదు” అన్నారు సుమంత్.

మరిన్ని వార్తలు