15 April, 2026 | 3:16 AM

జీవన్‌రెడ్డిని ఎప్పుడూ తక్కువగా చూడలే

15-04-2026 12:49 AM
  1. ఆయన గౌరవాన్ని తగ్గించేలా వ్యవహరించలేదు 
  2. జగిత్యాల కాంగ్రెస్ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 

జగిత్యాల, ఏప్రిల్ 14 (విజయక్రాంతి) : మేం ఎప్పు డూ జీవన్ రెడ్డిని తక్కువ చేసి చూడలేదు.. ఆయన మర్యాదను తగ్గించేలా మాట్లాడలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన గౌరవాన్ని తగ్గించేలా  వ్యవహరించలేదన్నారు. మంగళవారం జగిత్యాల కాంగ్రెస్ సీనియర్, ముఖ్య నేతలతో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది.ఈ సందర్భంగా వారితో సీఎం మాట్లాడుతూ  రాష్ట్రంలో పరిస్థితులను పంచుకోవాలనే మీతో సమావేశమయ్యానన్నారు.

భవిష్యత్‌లో ఆయనకు, ఆయన కుటుంబ సభ్యుల రాజకీయ భవిష్యత్‌కు హామీ ఇచ్చినా వినలేదు.. మొండి పట్టుదలతో జీవన్ రెడ్డి పార్టీ వీడారు. 40 ఏండ్లు ఆయన కోసం పనిచేసిన కార్యకర్తలను మోసం చేసి దుర్మార్గుడైన కేసీఆర్‌తో జతకట్టారు.జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి కేసీఆర్ దగ్గర చేతులు కట్టుకుని నిలబడటం అత్యంత బాధాకరం అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మ గౌరవాన్ని జీవన్ రెడ్డి కేసీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారు.

ఆయన వయసుకు, అనుభవానికి ఇది తగదని ఈనాటికీ నేను ఆయన గౌరవానికి భంగం కలిగేలా ఒక్క మాట మాట్లాడలేదన్నారు. కుట్రలను తిప్పి కొట్టాలని మనం ప్రయత్నం చేస్తుంటే ఆయన వెళ్లి అక్కడ చేరారు.ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతామంటే నిలబెట్టడం తప్పా నేను చేస్తుంది. మంచో చెడో మీరే ఆలోచించండి ఎవరు ఏమిటి అన్నది కాలమే నిర్ణయిస్తుంది.

అండగా నిలబడండి.. మళ్లీ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొద్దాం ధైర్యంగా ఉండండి త్వరలోనే కార్యకర్తలను కలిసేందుకు జగిత్యాలకు వస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అంతా కలిసికట్టుగా జగిత్యాలను అభివృద్ధి చేసుకుందాం. వ్యక్తికంటే పార్టీ ముఖ్యమని నిరూపించిన మీ అందరినీ అభినందిస్తు న్నా అని అన్నారు. కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, జగిత్యాల జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్ కుమార్,ప్రభుత్వ సలహాదా రు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జగిత్యాల డీసీసీ అధ్యక్షు లు నందయ్య, పాల్గొన్నారు.