6 July, 2026 | 4:17 PM

Breaking News

అనుమతి లేని తరగతులను సీజ్ చేసిన ఎంఈఓ రాజయ్య   •   ఎకో టూరిజం అభివృద్ధి చేయాలి: సీఎం రేవంత్​ రెడ్డి   •   ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి   •   8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •  

హౌసింగ్ బోర్డ్ కాలనీని అభివృద్ధి చేసి చూపిస్తా...

29-04-2025 06:53 PM

నూతన అధ్యక్షుడు కొండా నాగరాజు....

హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ కమిటీ ఎన్నికలు స్థానిక కమిటీ హాల్లో నిర్వహించారు. ఈ ఎన్నికలలో ప్రత్యర్థి మీద కొండా నాగరాజు అత్యధిక మెజార్టీతో అధ్యక్షుడుగా గెలుపొందారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కొండా నాగరాజు మీడియాతో మాట్లాడుతూ... హౌసింగ్ బోర్డ్ కాలనీని అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. కాలనీకి పూర్వ వైభవం తీసుకొస్తానని, కాలనీలో అద్వాన్నంగా ఉన్న పలు సమస్యలను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లానని, తన వంతు సహకారం అందిస్తానని తెలిపారన్నారు. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కమ్యూనిటీ హల్ నిర్మాణం, పాత భవనాలకు రిపేర్లు, కలర్స్ వేసి మోడల్ కాలనీగా తయారు చేస్తానని తెలిపారు. తనను అధ్యక్షుడుగా ఎన్నుకున్న కాలనీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. హౌజింగ్ బోర్డు కాలనీ ప్రధాన కార్యదర్శిగా గంగుల వినోద, కోశాధికారిగా బేతేల్లి రవి ఎన్నికయ్యారు.