6 July, 2026 | 4:18 PM

Breaking News

అనుమతి లేని తరగతులను సీజ్ చేసిన ఎంఈఓ రాజయ్య   •   ఎకో టూరిజం అభివృద్ధి చేయాలి: సీఎం రేవంత్​ రెడ్డి   •   ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి   •   8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •  

ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి

06-07-2026 03:46 PM

బోధన్,(విజయక్రాంతి): ప్రభుత్వ రెసిడెన్షియల్ గురుకుల ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని అలాగే వర్షాకాలం ప్రారంభం అవడంతో విద్యార్థులకు అనారోగ్య బారిన పడకుండా సరైన చర్యలు తీసుకోవాలని బోధన్  ఆర్డీవో ని కోరారు. అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ ప్రభుత్వ హాస్టల్ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో నైట్ టైం లో వార్డెన్ వాచ్మెన్ లు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయాలని కోరారు.

గతంలో బోధన్ పట్టణ కేంద్రంలో ఒక ప్రభుత్వ హాస్టల్లో వార్డెన్ అలాగే వాచ్మెన్ లేని సందర్భంలో విద్యార్థులు వాగ్వాదం పెట్టుకొని  జరిగిన గొడవలో ఒకరు ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. అలాంటి చర్యలు మరోసారి పునరావృతం కాకుండా సంబంధిత సిబ్బందికి రాత్రి వేళలో సిబ్బంది అందుబాటులో ఉండాలని కోరడం జరిగింది. సంబంధిత అధికారులు ప్రతి నెలకొకసారి తనిఖీలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని  కోరడం జరిగింది.