6 July, 2026 | 4:40 PM

Breaking News

భగీరథ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి   •   ఏటీఎంగా మార్చుకునేందుకే కాళేశ్వరం   •   అనుమతి లేని తరగతులను సీజ్ చేసిన ఎంఈఓ రాజయ్య   •   ఎకో టూరిజం అభివృద్ధి చేయాలి: సీఎం రేవంత్​ రెడ్డి   •   ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి   •   8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •  

ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం

06-07-2026 03:57 PM

కరీంనగర్ క్రైమ్: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సర్దార్ రణధీర్ సింగ్ రాణా ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన ప్రజావాణిలో కరీంనగర్ జిల్లా కలెక్టర్  చిత్ర మిశ్రా గారికి ప్రైవేటు విద్యా సంస్థల దోపిడిపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది, సర్దార్ రణధీర్ సింగ్ రాణా మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా లో వున్న  ప్రైవేట్ , కార్పొరేట్  పాఠశాలల్లో ఫీజుల దోపిడీ అరికట్టాలని అలాగే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా  ప్రవేట్ కార్పోరేట్ పాఠశాలల్లో ఫీజులు లక్షల లక్షలు ఫీజులు  తీసుకుంటున్నారని దానితోపాటు పాఠ్యపుస్తకాలు ఇతర వస్తువులన్నీ మా దగ్గరే కొనాలని విద్యార్థుల తల్లిదండ్రులను భయాందోళన గురి చేస్తున్నారని అన్నారు.

ఇది చూసినా కూడా విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. విద్యాహక్కు చట్టాన్ని ఏ ఒక్క పాఠశాల అమలు చేయడం లేదని పేద విద్యార్థులకు 25 శాతం ఫీజు రాయితీ ఇవ్వడం లేదు అని ఫీజు రాయితీ గురించి అడిగితే చదివిస్తే మా పాఠశాలలో చదివియ్యండి. లేకపోతే వేరే పాఠశాలకు తీసుకెళ్లండి అని విడ్డూర పద్ధతితో  మాట్లాడుతున్నారని  అన్నారు.  ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు విద్యాశాఖ  అధికారులు కుమ్మక్కయ్యారని అని ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా విద్యాశాఖ అధికారులు నిద్రలో నుంచి మేలుకొని ప్రత్యేకమైన కమిటీని వేసి డిఈఓ, ఎంఈఓ, తో ప్రవేట్ పాఠశాల తనిఖీ చేయించాలన్నారు. లోపాలు ఏర్పడితే పాఠశాల పర్మిషన్ రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ గారిని కోరారు . జిల్లాలో విద్యావ్యవస్థను సక్రమంగా నడపాలని లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి  ఉద్యమాలు చేస్తామని  సర్దార్ రణధీర్ సింగ్ రాణా అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఏపి జిల్లా  జనరల్ సెక్రెటరీ ఎండి సాదిక్  జిల్లా ఉపాధ్యక్షులు దినేష్ తదితరులు పాల్గొన్నారు .