6 July, 2026 | 4:40 PM

Breaking News

భగీరథ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి   •   ఏటీఎంగా మార్చుకునేందుకే కాళేశ్వరం   •   అనుమతి లేని తరగతులను సీజ్ చేసిన ఎంఈఓ రాజయ్య   •   ఎకో టూరిజం అభివృద్ధి చేయాలి: సీఎం రేవంత్​ రెడ్డి   •   ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి   •   8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •  

విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు

06-07-2026 03:55 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో ఆదివారం రాత్రి భోజనం చేసిన అనంతరం పలువురు విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పాఠశాల యాజమాన్యం వారిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, బీర్కూర్ ఉప సర్పంచ్ పరమేష్ పంతులు కాంగ్రెస్ నాయకులు ఎజాజ్, శశికాంత్ లు ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. అనంతరం వైద్య సిబ్బందితో మాట్లాడి విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చికిత్స అందించాలని సూచించారు. విద్యార్థులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తు,తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.