6 July, 2026 | 4:26 PM

Breaking News

అనుమతి లేని తరగతులను సీజ్ చేసిన ఎంఈఓ రాజయ్య   •   ఎకో టూరిజం అభివృద్ధి చేయాలి: సీఎం రేవంత్​ రెడ్డి   •   ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి   •   8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •  

ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ

06-07-2026 03:52 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలం ధర్మారం గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం సర్పంచ్ మిర్యాల్కార్ బాలాజీ, వార్డు సభ్యులు కీసరి కావేరి, నీరటి పరుశురాములు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించి, విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించారు.పిల్లలకు అందుతున్న విద్య, పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పాఠశాల సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పొట్లపెల్లి గోపాల్ రావు,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని, పాఠశాల అభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు.