15 April, 2026 | 12:35 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మీ నమ్మకాన్ని వమ్ముచేయను

09-02-2026 02:09 AM

చేవెళ్ళ మున్సిపల్ 16వ వార్డు కౌన్సిలర్గా చైర్మన్ అభ్యర్థి  దేవర సమతా వెంకట్ రెడ్డి

చేవెళ్ళ, ఫిబ్రవరి 8(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నగార మొగిన నేపథ్యంలో చేవెళ్ల మునిసిపల్  16వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి దేవర సమతా వెంకట్ రెడ్డి ప్రచారంలో దూసుకు పోతున్నారు. 14,15 వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.  వ్యవసాయ కుటుంబ నేపథ్యం కలిగిన సమత వెంకట్ రెడ్డి ప్రజలతో కలివిడిగా మాట్లాడుతూ మీ నమ్మకాన్ని ఎప్పటికీ వమ్మి చేయమని భరోసామిస్తున్నారు.

ప్రచారంలో భాగంగా వారు మాట్లాడుతూ... రాజకీయ జీవితం ఇచ్చిన చేవెళ్ల ప్రజలను మా కుటుంబం మరువదన్నారు. సేవే... లక్ష్యం ప్రేమే మార్గంగా ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు. ఎమ్మెల్యే కాలే యాదయ్య ఎంపీ రంజిత్ రెడ్డిల సహకారంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సిసి రోడ్లు, వీధి దీపాలు, మంచినీటి సౌకర్యం, మెరుగైన పారిశుధ్యం ఏర్పాటు చేసి మున్సిపల్ రూపురేఖలు మార్చుతామని స్పష్టం చేశారు.

మీబిడ్డగా 16వ వార్డు కౌన్సిలర్ గా తనను ఆదరించాలన్నారు. అధికార పార్టీ నుండి అధిక నిధులు తెచ్చి అభివృద్ధిలో రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామంటున్నారు. చేవెళ్ళ మున్సిపాల్టీ అభివృద్ధిపై ప్రజలకు కోటి ఆశలు ఉన్నాయని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాటప్రకారం ఆరు సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలవుతున్నాయని చెప్పారు.

పేదలకు సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, కార్పొరేట్ ఆస్పత్రిలో రూ.10 లక్షల ఆరోగ్య భీమా, రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు భరోసా రైతు బీమా పథకాలు అందిస్తుందని చెప్పారు. మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. హెచ్‌ఎండిఏ నిధులు రూ. 15 కోట్లతో చేవెళ్లలో ఇదివరకే శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించమని గుర్తు చేశారు. అభివృద్ధిలో చేవెళ్ల రూపురేఖలు మార్చి చూపిస్తానని వాగ్దానం చేశారు.