23 June, 2026 | 2:56 PM

సర్వే నంబర్ 218 బాధితులకు అండగా పువ్వాడ అజయ్ కుమార్

23-06-2026 02:00 PM

ఖమ్మం, జూన్ 23 (విజయక్రాంతి): రఘునాథపాలెం మండలం సర్వే నంబర్ 218లో ప్లాట్లు కోల్పోయిన బాధితులు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. యంగ్ ఇండియా స్కూల్, హైవే విస్తరణ పేరుతో ప్లాట్లను స్వాధీనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల గోడు విన్న పువ్వాడ అజయ్ కుమార్ వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. న్యాయం జరిగే వరకు న్యాయపరంగా, రాజకీయంగా పోరాడుతామని హామీ ఇచ్చారు. బాధితులకు తగిన న్యాయం జరిగేలా కృషి చేస్తామని తెలిపారు.